రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికరంగం పుంజుకోవాలి: కేఈ

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ రోజు కర్నూలులో జరిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికరంగం పుంజుకోవాలని అన్నారు. పారిశ్రామికాభివృద్ధి జరిగితేనే ఉపాధికల్పన సాధ్యమవుతుందని, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పిస్తామని తెలిపారు. గత ఏపీఐఐసీలో పలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
Go Back to Shorts

More Telugu News