మార్చి 14న విజయవాడ, తిరుపతిలో పాస్ పోర్ట్ మేళా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్చి 14న విజయవాడ, తిరుపతిలో పాస్ పోర్ట్ మేళా

మార్చి 14వ తేదీన విజయవాడ, తిరుపతి పట్టణాల్లోని పాస్‌ పోర్ట్ కేంద్రాల్లో పాస్‌ పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌ పోర్ట్ అధికారి ఎల్.మదన్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆ రోజు ఒక్కో పాస్ పోర్టు కేంద్రంలో 600 స్లాట్ లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ స్లాట్ లను ఈ నెల 11వ తేదీ నుంచి బుక్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అపాయింట్‌ మెంట్ కొరకు www.passportindia.gov.in వెబ్‌ సైట్ ను సందర్శించాలని ఆయన చెప్పారు.

More Telugu News