Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మలేషియా విమాన ఘటనలో క్లూ... వేలమైళ్ళు ప్రయాణం చేసి ఆస్ట్రేలియా తీరానికి చేరిన చిన్న ప్యాకెట్

మలేషియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్ 370 విమానం మాయమై ఒక సంవత్సరం గడిచిన తర్వాత చిన్న క్లూ ఒకటి దొరికింది. ఈ ఉదయం ఆస్ట్రేలియా తీరానికి ఓ చిన్న ప్యాకెట్ కొట్టుకు వచ్చింది. ఇక్కడి సెర్ వాంటెస్ బీచ్ విహారానికి వచ్చిన కింగ్ స్లే, విక్కీ మిల్లర్ దంపతులకు ఈ ప్యాకెట్ దొరికింది. దీని మీద మలేషియా ఎయిర్లైన్స్ లోగో స్పష్టంగా ఉండడంతో, దీన్ని పోలీసులకు అప్పగించామని వారు తెలిపారు. వేల మైళ్ళు ప్రయాణం చేసి ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక చిన్న కర్చీఫ్ లాంటి ఈ ప్యాకెట్ విమానం కోసం వెతుకుతున్న అధికారులలో కోటి ఆశలు రేపుతోంది. ఆ ప్యాకెట్ మాయమైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానానికి సంబంధించినది అయి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News