ఈ వాచ్ పిల్లలకు పెట్టండి...వాళ్లెలా ఉన్నారో అన్న దిగులు ఇక వదలండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ వాచ్ పిల్లలకు పెట్టండి...వాళ్లెలా ఉన్నారో అన్న దిగులు ఇక వదలండి!

ఆఫీసుకు వెళ్లిన దగ్గర్నుంచి పిల్లలు ఏం చేస్తున్నారు? స్కూల్లో ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? సురక్షితంగా ఉన్నారా? లేదా? అంటూ తల్లిదండ్రులు దిగులు చెందడం సహజం. అలాంటి తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నాయి గాడ్జెట్ కంపెనీలు. స్మార్ట్ వాచీని తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేశారు. దానిని తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్ కు అనుసంధానం చేశారు. దీంతో పిల్లలు ఎక్కడ? ఎలా? ఉన్నారని దిగులు చెందక్కర్లేదట. అవసరమైనప్పుడు పిల్లలతో మాట్లాడవచ్చని తయారీ సంస్థ చెబుతోంది. పిల్లలు సురక్షిత స్ధానం నుంచి బయటకు వెళ్తే అప్రమత్తం చేసే సౌకర్యం కూడా ఉందని వారు చెబుతున్నారు. ఇక ఆలస్యం ఎందుకు, పిల్లలకు ఓ వాచ్ కొని పెట్టేస్తే సగం దిగులు తగ్గినట్టే!

More Telugu News