Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డెడ్ లైన్ల పేరుతో రైతుల భూములు లాక్కోవద్దు... రైతు శోకం రాజధానికి తగులుతుంది: పవన్

రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉండవల్లి గ్రామంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున పవన్ అభిమానులు, రైతులు సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రైతు కన్నీటితో వచ్చే రాజధాని అవసరం లేదని చెప్పారు. తనకు కూడా గొప్ప రాజధాని రావాలనే కోరిక బలంగా ఉందని... కానీ, రైతు కన్నీరు పెడితే ఆ శోకం రాజధానికి తగులుతుందని అన్నారు. ల్యాండ్ పూలింగ్ నిలిపివేయాలని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటిని కోరుతున్నానని చెప్పారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకే వచ్చానని, రైతులకు అండగా ఉంటానని అన్నారు. డెడ్ లైన్లు పెట్టి ఉండవల్లి గ్రామంలోని రైతుల భూములను తీసుకోవద్దని పవన్ సూచించారు.

More Telugu News