ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవు: స్వరూపానందేంద్ర సరస్వతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవు: స్వరూపానందేంద్ర సరస్వతి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక విషయాలలో ఎపీ, తెలంగాణ రాష్ట్రాలు పీఠాధిపతులు, మఠాధిపతులను సంప్రదించడం లేదని అన్నారు. హైందవ మతాలకు మంచి జరుగుతుందని ఎన్నికలప్పుడు ఈ ప్రభుత్వాలను గెలిపించేందుకు రోడ్ల మీదకు వచ్చామని స్వరూపానంద చెప్పారు. కానీ ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులను విస్మరించిన ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని అన్నారు. పుష్కరాలను ఆధ్యాత్మికంగా కాకుండా, అధికారికంగా నిర్వహించాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. శ్రీరామ నవమి ఉత్సవాలను ఒంటిమిట్ట రామాలయంలో నిర్వహించాలనే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

More Telugu News