అమెరికా ల్యాబ్ నుంచి తప్పించుకున్న ప్రాణాంతక వైరస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా ల్యాబ్ నుంచి తప్పించుకున్న ప్రాణాంతక వైరస్!

జీవ యుద్ధం (బయో వార్) వస్తే ప్రయోగించేందుకు సిద్ధం చేసుకున్న ప్రాణాంతక వైరస్ ఒకటి తప్పించుకుని భూవాతావరణంలో కలసిపోయిందట. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కలిగిన అమెరికాలోని బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్ ల్యాబ్ నుంచి గత నవంబర్ నెలలో వైరస్ బయటకు వెళ్ళగా, ఈ అంశంపై లూసియానా అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారని అమెరికా అధికారికంగా ప్రకటించింది. 'బర్క్‌ హోల్డేరియా సూడోమెల్లీ'గా పిలిచే ఈ వైరస్‌ను 'బయో టై ఏజెంట్'గా పేర్కొనవచ్చని అమెరికా నిపుణులు తెలిపారు. కోవింగ్టన్ సిటీలోని బయోలాజికల్ లాబ్ నుంచి ఇది మాయం అయిందని, నేల, నీటి ద్వారా ఈ వైరస్ మానవులకు సోకుతుందని, దానివల్ల ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే, ఇంతవరకు ప్రజలకు ఈ వైరస్ సోకినట్టు రుజువు కాలేదని, పరిసరాల్లో నేల, నీటి పరీక్షల్లో కూడా ఈ వైరస్ ఉన్నట్టు తేలలేదని వారు తెలిపారు. ఈ మొత్తం ఘటన ఆందోళనకరమైన సంగతేనని న్యూజెర్సీలోని రట్జర్స్ వర్సిటీకి చెందిన బయో సేఫ్టీ నిపుణులు వ్యాఖ్యానించారు. పలు రకాల వైరస్‌లకు మందులను కనుగొనేందుకే ఈ ల్యాబ్‌లో పరిశోధనలు జరుగుతున్నాయని అమెరికా చెబుతున్నా, జీవ యుద్ధం కోసం అమెరికా ఈ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తోందని, ఇస్లామిక్ దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News