కెనడా మహిళపై యోగా గురువు లైంగిక వేధింపులు... కాలిఫోర్నియా కోర్టులో కేసు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కెనడా మహిళపై యోగా గురువు లైంగిక వేధింపులు... కాలిఫోర్నియా కోర్టులో కేసు

వాంకోవర్ కేంద్రంగా యోగాలో శిక్షణ ఇస్తూ, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న యోగా గురు విక్రమ్ చౌదరి చిక్కుల్లో పడ్డాడు. గత మూడేళ్ళలో ఆయన తనను పలుమార్లు లైంగికంగా వేధించాడని, బలవంతంగా అనుభవించాడని ఓ కెనడా మహిళ కాలిఫోర్నియా ఉన్నత న్యాయస్థానంలో కేసు వేసింది. కాగా, విక్రమ్ చౌదరిపై ఇప్పటికే ఇవే తరహాలో 5 కేసులు నమోదయ్యాయి. తొలి కేసు ఆగస్టులో విచారణకు రానుంది. తన క్లయింటు 18 సంవత్సరాల వయసులో తొలిసారిగా ఆయన వద్దకు యోగాలో శిక్షణ కోసం 2010లో వెళ్లిందని బాధితురాలి తరపు లాయర్ తెలిపారు. ఆయన తాకకూడని చోట తాకేవాడని, తనతో హోటల్ రూంకు తీసుకు వెళ్లి, ఆమెపై అత్యాచారం చేశాడని వివరించారు. ఆపై ఆమె శిక్షకురాలిగా ఆయన వద్ద విధులు నిర్వహిస్తున్నప్పుడు పలుమార్లు వేధింపులు కొనసాగాయని తెలిపారు. ఆయనకు నగరంలో ప్రముఖులతో పరిచయాలు ఉండడంతో తన క్లయింటు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారని, దీనికి తోడు "నా మాట వినని ప్రజలు చనిపోతారు" అని విక్రమ్ చెప్పడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారని పేర్కొన్నారు. కాగా, ఈ ఆరోపణలను విక్రమ్ తరపు న్యాయవాది కొట్టిపారేశారు. ఆయనపై ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని తెలిపారు.

More Telugu News