లిజార్డ్ స్క్వాడ్ 'లెనోవో' వెబ్ సైట్ నూ వదల్లేదు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లిజార్డ్ స్క్వాడ్ 'లెనోవో' వెబ్ సైట్ నూ వదల్లేదు!

ఇటీవల సోషల్ నెట్ వర్కింగ్ సైట్లతో పాటు, ప్రముఖ సంస్థల వెబ్ సైట్లను హ్యాక్ చేస్తున్న లిజార్డ్ స్క్వాడ్ తాజాగా లెనోవో వెబ్ సైట్ ను హ్యాక్ చేసింది. లెనోవో వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైనట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అటు, తామే హ్యాకింగ్ కు పాల్పడ్డట్టు లిజార్డ్ స్క్వాడ్ కూడా ట్విట్టర్ ద్వారా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం లెనోవో యూజర్లకు పలు సూచనలు చేసింది. వైరస్ తరహా సాఫ్ట్ వేర్ 'సూపర్ ఫిష్' ను ల్యాప్ టాప్ ల నుంచి తొలగించాలని సలహా ఇచ్చింది. ఆ ప్రీ-ఇన్ స్టాల్ డ్ సాఫ్ట్ వేర్ కారణంగా ల్యాప్ టాప్ లపై సైబర్ దాడులు సులువు అవుతున్నాయని వివరించింది. కిందటి నెలలో లిజార్డ్ స్క్వాడ్ సోనీ కార్పొరేషన్ ప్లే స్టేషన్ నెట్ వర్క్ పైనా, మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ లైవ్ నెట్ వర్క్ పైనా దాడులు చేయడం తెలిసిందే.

More Telugu News