స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల బాలుడి మృతి... కృష్ణా జిల్లాలో ఘటన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల బాలుడి మృతి... కృష్ణా జిల్లాలో ఘటన

కృష్ణా జిల్లాలో నేటి ఉదయం దారుణం చోటుచేసుకుంది. పాఠశాల బస్సు కింద పడిన మూడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. జిల్లాలోని మండవల్లి మండలం ఇంగిలిపాకలంకలో కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఘటనలో సాయి పబ్లిక్ స్కూల్ బస్సు కిందపడ్డ బాలుడు నవీన్ అక్కడిక్కడే చనిపోయాడు. ఘటన జరిగిన తీరుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News