మార్చి 5న పాక్ లో మరో ఇద్దరికి ఉరి అమలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్చి 5న పాక్ లో మరో ఇద్దరికి ఉరి అమలు

పాకిస్థాన్లో మరో ఇద్దరికి ఉరి శిక్ష అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1998లో మహమ్మద్ ఫైజల్, మహమ్మద్ అఫ్జల్ అనే ఇద్దరు నేరస్థులు కోరంగి అనే ప్రాంతంలో దొంగతనానికి పాల్పడి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. దీంతో వారికి 1999లో కింది స్థాయి కోర్టు మరణ శిక్ష విధించింది. పై కోర్టులలో కూడా వీరికి చుక్కెదురైంది. పాకిస్థాన్ అధ్యక్షుడు సైతం వీరి క్షమాభిక్ష పిటిషన్ ను తోసిపుచ్చారు. దీంతో, వీరి ఉరితీతకు సంబంధించిన నోటీసులను ఉగ్రవాద కేసుల పరిష్కరణ న్యాయస్థానం జారీ చేసింది. మార్చి 5న వారిని ఉరితీయాలని ఆదేశించింది.

More Telugu News