Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామకుప్పం చేరుకున్న చంద్రబాబు... మరికాసేపట్లో మిట్టపల్లి వాసులతో ముఖాముఖి

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం రామకుప్పం చేరుకున్నారు. అక్కడి నుంచి మండలంలోని మిట్టపల్లి చేరుకోనున్న చంద్రబాబు ఆ గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్లిన ఆయన అక్కడి నుంచి రామకుప్పం చేరుకున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలోనే పర్యటించనున్న చంద్రబాబు, నియోజకవర్గంలోని కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లి మండలాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు.

More Telugu News