వెలుగు చూసిన 43 కోట్ల కుంభకోణం...బ్యాంకు ఉద్యోగుల అరెస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెలుగు చూసిన 43 కోట్ల కుంభకోణం...బ్యాంకు ఉద్యోగుల అరెస్టు

ప్రకాశం జిల్లా, ఇంకొల్లులోని ఎస్ బీహెచ్ లో 43 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగుచూసింది. ఈ రుణాల కుంభకోణానికి సంబంధించి రామ్మోహనరావు, రామకోటేశ్వరరావు అనే ఇద్దరు బ్యాంకు అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 2012లో బాండ్లు తాకట్టు పెట్టుకుని బ్యాంకు ఉద్యోగులు కోల్డ్ స్టోరేజీలకు రుణాలను మంజూరు చేశారు. సరుకులు లేకపోవడంతో యాజమాన్యాలు వాటిని ఇతరులకు అమ్మేశారు. సరుకులు లేకపోయినా వాటికి రుణాలు ఎలా మంజూరు చేశారనే అభియోగాలపై వీరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

More Telugu News