సోనియా అల్లుడి 'హోదా' హుష్ కాకి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోనియా అల్లుడి 'హోదా' హుష్ కాకి!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా విమానాశ్రయాల్లో పొందుతున్న ప్రత్యేక హోదా తొలగిపోయింది. ఎటువంటి చెకింగ్ లేకుండా ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లే అనుమతి ఉన్నవారి జాబితా నుంచి ఆయన పేరును గోవా విమానాశ్రయ అధికారులు తొలగించారు. యూపీఏ అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ పరంగా అందే అన్ని రకాల ప్రత్యేక సేవలు పొందిన ఆయనకు ఇకపై ఆ హోదా కల్పించబోమంటూ ఎయిర్ పోర్టులోనే నోటీసు అంటించారు. అర్హత లేని వ్యక్తులకు ప్రత్యేక సేవల్ని ఆపాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇటీవల పౌర విమానయాన శాఖకు ఆదేశాలు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక సేవలకు అర్హులైన వ్యక్తుల జాబితాలోని వాద్రా పేరును అధికారులు ప్లాస్టర్ తో మూసివేశారు. ఇకపై ఆయన ఎయిర్ పోర్ట్ కు వెళితే సాధారణ ప్రయాణికుల మాదిరి పోలీసుల సోదాలకు సహకరించాల్సిందే.

More Telugu News