Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీచర్‌ను వేధించిన శివసేన నేత... బహిష్కరణ

ప్రభుత్వ జడ్పీ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయురాలితో అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఆరోపణపై శివసేన నేత గణేష్ అధానేపై ఔరంగాబాద్ జిల్లా కుల్‌ తాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గడచిన రిపబ్లిక్ డే నాడు, తిరిగి ఈ నెల 6వ తేదీన గణేష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆ ఉపాధ్యాయురాలు ఆరోపించారు. తనను లొంగదీసుకునేందుకు బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని, ఈ విషయాన్ని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు ఓ లేఖ రూపంలో తెలిపానని వివరించారు. దీనిపై స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే గణేష్‌ ను పార్టీ నుంచి బహిష్కరించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News