60 ఏళ్ల దరిద్రం ఆరునెలల్లో పోతుందా? టీఆర్‌ఎస్ తల్లి అయితే, కాంగ్రెస్ నర్సు లాంటిది: కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

60 ఏళ్ల దరిద్రం ఆరునెలల్లో పోతుందా? టీఆర్‌ఎస్ తల్లి అయితే, కాంగ్రెస్ నర్సు లాంటిది: కేటీఆర్

ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా సేవ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి తల్లి వంటిదైతే, కాంగ్రెస్ డబ్బులు తీసుకొని సేవ చేసే నర్సులాంటిదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించి, వివిధ అభివృద్ది పథకాలను పర్యవేక్షించిన ఆయన కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్‌ లో ఉన్న 'ముగ్గురు మొనగాళ్లు' నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారి మాటలను ప్రజలు ఏ మాత్రం నమ్మడం లేదని అన్నారు. 60 ఏళ్ల దరిద్రం ఆరునెలల్లో అంతమైపోదని, సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారని వివరించారు.

More Telugu News