అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన రెబల్ స్టార్ కృష్ణంరాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన రెబల్ స్టార్ కృష్ణంరాజు

కేంద్ర మాజీమంత్రి, సీనియర్ సినీనటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు నిమ్స్‌లో చేరారు. నిన్న స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయనను బంధువులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. నిమ్స్ కార్డియాలజీ విభాగం చీఫ్ డాక్టర్ శేషగిరిరావు నేతృత్వంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించామని, అంతా నార్మల్‌ గా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతున్న దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డిని తెలంగాణ మంత్రులు హరీశ్‌ రావు, జగదీశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్ తదితరులు పరామర్శించారు.

More Telugu News