'పిల్ల జమిందార్' ఎన్ని సార్లు చూశానో నాకే తెలీదు: జూనియర్ ఎన్టీఆర్
తెలుగు సినీ రంగంలో నాని ప్రతిభ ఉన్న నటుడని ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. 'ఎవడే సుబ్రమణ్యం' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, నాని నటించిన పిల్ల జమిందార్ సినిమాను లెక్కలేనన్ని సార్లు చూశానని అన్నాడు. ఆ సినిమా తన భార్యకు ఇష్టమైన సినిమాల్లో ఒకటని ఎన్టీఆర్ చెప్పాడు. నానిని నిర్మాతలు పెట్టిన హింస తనను 'స్టూడెంట్ నెంబర్ వన్' అప్పుడే పెట్టేశారని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ కి ఇష్టమైన పాటను ఆవిష్కరించాడు. సినిమా హిట్ కావాలని ఆశిస్తూ పాటను విడుదల చేశాడు.