కేటీఆర్ బైక్ ర్యాలీలో అపశృతి... బైక్ అదుపు తప్పి టీఆర్ఎస్ కార్యకర్త మృతి
తెలంగాణ మంత్రి కేటీఆర్ చేపట్టిన బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. నేటి ఉదయం నిజామాబాదు జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ జిల్లాలోని బికనూర్ మండలంలో పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అనంతరం ఆయన నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీ బికనూర్ మండలం బస్వాపూర్ వద్దకు రాగానే ఓ బైక్ అదుపు తప్పింది. దీంతో కిందపడ్డ పార్టీ కార్యకర్త ఒకరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కార్యకర్త మరణంతో ర్యాలీలో విషాదం నెలకొంది.