నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారానికి మమతకు ఆహ్వానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారానికి మమతకు ఆహ్వానం

బీహార్ ముఖ్యమంత్రిగా రేపు జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి విదితమే. ఈ కార్యక్రమానికి పలువురిని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా మీడియాకు తెలిపారు. "ఆదివారం జరిగే ప్రమాణ స్వీకారానికి నితీశ్ జీ నన్ను ఆహ్వానించారు. నేను హాజరవుతున్నా. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నా" అని బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న దీదీ చెప్పినట్టు కోల్ కతాలో ఓ ప్రకటన విడుదలైంది. అంతకుముందు నితీశ్ మరోసారి సీఎం కాబోతుండటంపై మమతా శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News