Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అన్నింటికీ ఆధార్!... తాజాగా రైలు టిక్కెట్ల రాయితీకి తప్పనిసరి

రాయితీపై రైలులో ప్రయాణం చేయాలంటే ఆధార కార్డు నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన అమలు కానుంది. తొలుత సీనియర్ సిటిజన్ల రాయితీలకు 'ఆధార్' అనుసంధానం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఆపై దశలవారీగా ఇతర రాయితీలకూ వర్తింపచేయాలని భావిస్తోంది. టిక్కెట్టు రిజర్వేషన్ సమయంలో సంబంధిత వ్యక్తుల పేరుతో పాటు ఆధార్ విశిష్ట సంఖ్యను నమోదు చేయాల్సివుంటుంది. ప్రస్తుతం రైల్వేల్లో పురుషులకు 60, మహిళలకు 58 ఏళ్లు నిండితే సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో మగవారికి 40 శాతం, ఆడవారికి 50 శాతం రాయితీ అందుతోంది. ఈ సౌకర్యం దుర్వినియోగం కాకుండా చూసేందుకే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News