చరిత్రలో మిగలకుండా పోతావు చంద్రబాబు!: కవిత విసుర్లు
తెలంగాణ వీరుల ఉద్యమ చరిత్రను భావి తరాలకు అందించకుంటే, చరిత్రలో లేకుండా పోతావని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిజామాబాద్ ఎంపీ కవిత హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పుస్తకాల్లో తెలంగాణ చరిత్రకు చోటు లేకుండా చేయాలని బాబు యోచిస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కవిత ప్రసంగించారు. కేసీఆర్ చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆమె అన్నారు.