దుబాయి ఆకాశ సౌధం ‘టార్చ్’లో అగ్నిప్రమాదం... అప్రమత్తతతో తప్పిన పెను ముప్పు
ఆకాశ హర్మ్యాలకు పెట్టింది పేరైన దుబాయిలో కొద్దిసేపటి క్రితం భారీ ప్రమాదం సంభవించింది. ఆ దేశంలోని ఓ ఆకాశ సౌధం ‘టార్చ్’ లో అగ్ని ప్రమాదం సంభవించింది. భవంతిలోని 59 వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో భవంతిలో వేలాది మంది ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అక్కడి పోలీసులు, సహాయక సిబ్బంది భవంతిలోని వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం భవంతిలో ఎగసిపడుతున్న అగ్ని కీలలను ఫైరింజన్ల సాయంతో అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.