విమానం కూలిందని ఎలా ప్రకటించారు? శాస్త్రీయత ఏంటి?: కడిగేసిన ప్రయాణికుల కుటుంబాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమానం కూలిందని ఎలా ప్రకటించారు? శాస్త్రీయత ఏంటి?: కడిగేసిన ప్రయాణికుల కుటుంబాలు

మలేసియా విమానం ఎమ్ హెచ్ 370 అదృశ్యమై ఏడాది దాటింది. గతేడాది జనవరి 29న 239 మంది ప్రయాణికులతో నింగికెగసిన విమానం ఆచూకీ లేకుండా పోయింది. దాని కోసం సుదీర్ఘకాలం వెతికిన మలేసియా ప్రభుత్వం దాని ఆచూకీ కనుక్కోవడంలో విఫలమై, లాభం లేదని భావించి ఆ విమానం కూలిపోయిందని, అందులో ప్రయాణించిన వారంతా మరణించినట్టే భావిస్తున్నామని ప్రకటించింది. దీంతో విమాన ప్రమాద మృతుల బంధువులకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై మలేసియా విమానంలో ప్రయాణించిన చైనా వ్యక్తుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ ప్రకటనను తక్షణం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విమాన శకలాలు, మృతదేహాలు ఆచూకీ తెలియకుండా ప్రమాదం జరిగిందని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. విమాన ప్రమాద వార్తతో తమ కుటుంబాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అనుభవిస్తున్న ఆవేదన మీకు అర్థం కావడం లేదంటూ మలేసియా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విమాన ఆచూకీ కోసం గట్టి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. విమానం అదృశ్యమైన ప్రాంతంలో గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని వారు మలేసియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

More Telugu News