Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సౌదీ రాజు 2వేల కోట్లు పంచేశారు

యూరోపియన్ దేశాలు ద్రవ్యోల్బణంతో అల్లాడుతు, పొదుపు చర్యలు పాటిస్తుంటే... సౌదీ అరేబియాలో కొత్త రాజు తన ప్రజలకు డబ్బులు విరివిగా పంచిపెడుతున్నారు. ఓ ఆజ్ఞతో వందల కోట్ల డాలర్లను సామాన్య ప్రజలకు పంచిపెడుతున్నారు. రాజు సల్మాన్ ఔదార్యంతో సౌదీ అరేబియా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సౌదీ రాజు ఇలా ఇస్తున్న బహుమతుల విలువ దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన నైజీరియా వార్షిక బడ్జెట్ కంటే కూడా ఎక్కువ. గత నెలలో సౌదీ అరేబియా రాజుగా సింహాసనం అధిష్ఠించిన సల్మాన్, సంస్కరణలకు తెరతీశారు. దీంతో ప్రభుత్వ సంస్థలను రద్దుచేస్తున్నారు, మంత్రులను తొలగిస్తున్నారు.

More Telugu News