ఇకపై ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట... ఎంపిక చేసిన బాబు సర్కారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇకపై ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట... ఎంపిక చేసిన బాబు సర్కారు

అధికారికంగా శ్రీరామ నవమి వేడుకలను కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రం విడిపోకముందు నవమి వేడుకలను ఖమ్మం జిల్లా భద్రాచలంలో నిర్వహిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేదా సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేవారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం ఆలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లింది. దీంతో మార్చి 28న నిర్వహించనున్న నవమి వేడుకలు అధికారికంగా జరిపేందుకు ఒంటిమిట్టలోని రామాలయాన్ని ఎంపిక చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. అయితే దీనికి సంబంధించి జీవో విడుదల కావాల్సి ఉంది.

More Telugu News