రేపు తెలుగు సినీ పరిశ్రమ బంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు తెలుగు సినీ పరిశ్రమ బంద్

రేపు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం బంద్ అని దర్శకరత్న దాసరి నారాయణ రావు తెలిపారు. శతాధిక సినిమాల నిర్మాత, మూవీ మొఘల్ డి.రామానాయుడు మృతికి సంతాప సూచకంగా రేపు తెలుగు సినీ పరిశ్రమ బంద్ కానుందని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన దాసరి పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ రామానాయుడుకి ఎదో ఒకరకమైన అనుబంధం ఉంది. స్టూడియో అధినేతగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, సినిమా హాళ్ల ఆధినేతగా ఇలా పలు రకాలైన సంబంధాలు ఆయనకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఆయన మృతికి సంతాపం ప్రకటించనుంది. దీంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లు కూడా మూతపడనున్నాయి.

More Telugu News