రామానాయుడు మృతికి ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సంతాపం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామానాయుడు మృతికి ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సంతాపం

ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ గా పేరొందిన దగ్గుబాటి రామానాయుడు మరణానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని బాబు అన్నారు. రామానాయుడు శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డు నెలకొల్పారని, చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తెచ్చేందుకు ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచానికి తీరని లోటన్నారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

More Telugu News