Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంతర్ రాష్ట్ర ప్రాజెక్టుల కోసం టీఎస్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు

ప్రతి రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలతో చిన్నా, చితకా సమస్యలు ఉండటం సహజమే. కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఏపీ లాంటి రాష్ట్రాలకైతే ఇవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో, అంతర్ రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణం, వివాదాల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం 'టెక్నికల్ అడ్వైజరీ కమిటీ'ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఛైర్మన్ గా రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఎన్.గోపాల్ రెడ్డి వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా అబ్దుల్ రవూఫ్, కె.వేణుగోపాలరావులను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఈ కమిటీ సలహాలను కూడా ఇవ్వనుంది.

More Telugu News