కలుషితమైన శివ ప్రసాదం... ఉజ్జయినిలో 400 మందికి అస్వస్థత
శివరాత్రి పర్వదినాన ప్రసాదం స్వీకరించిన భక్తులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో జరిగింది. ఇక్కడి మహదేవ్ దేవాలయంలో నిన్న రాత్రి కిచిడి, ఖీర్ ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు. వాటిని ఆరగించిన వెంటనే 400 మంది భక్తులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. స్పందించిన అధికారులు వీరిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రసాదం కలుషితం కావడం వల్లనే ఇలా జరిగిందని, ఆహార పదార్థాలను పరీక్షలకు పంపించామని జిల్లా వైద్యాధికారి తెలిపారు.