ఆఫ్ఘన్ బౌలర్ల సమష్టి ప్రదర్శన... 267 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆఫ్ఘన్ బౌలర్ల సమష్టి ప్రదర్శన... 267 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్

ఆఫ్ఘనిస్తాన్ తో గ్రూప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్ బౌలర్లు రాణించడంతో బంగ్లాదేశ్ చివరి 5 ఓవర్లలో 34 పరుగులే చేసి 5 వికెట్లు కోల్పోయింది. బంగ్లా జట్టులో ముష్ఫికర్ రహీం (71) టాప్ స్కోరర్. స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ 63 పరుగులతో రాణించాడు. రహీం-షకిబ్ జోడీ ఐదో వికెట్ కు 114 పరుగులు జోడించింది. వీరిద్దరూ అవుటైన తర్వాత బంగ్లాదేశ్ వడివడిగా వికెట్లు చేజార్చుకుంది. ఆఫ్ఘన్ బౌలర్లలో హసన్, జాద్రాన్, ఆలమ్, అష్రాఫ్ తలా 2 వికెట్లతో రాణించారు. నబీకి ఓ వికెట్ దక్కింది.

More Telugu News