ముఖేష్ అంబానీకి ఐసీటీ డాక్టరేట్
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి ముంబయిలోని అల్మా మేటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కళాశాల గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 1979లో ఇదే కళాశాలలో బీటెక్ లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన ఈ గౌరవాన్ని ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెసర్ జార్జ్ వైట్ సైడ్స్ తో పంచుకున్నారు. విద్యా విషయక ప్రావీణ్యతలో ఐసీటీ ముందంజలో ఉందని ముఖేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తానిక్కడకు వచ్చినప్పుడు గతంకంటే ఉత్తమంగా ఉందని, మరింత ఉన్నత స్థానానికి చేరుకుందని ప్రశంసించారు.