శేషాచలం అడవుల్లో కార్చిచ్చు... తిరుపతి వేద పాఠశాల సమీపంలో మంటలు
తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న శేషాచలం అడవుల్లో కార్చిచ్చు రాజుకుంది. కొద్దిసేపటి క్రితం అడవుల్లో వెలుగు చూసిన కార్చిచ్చు శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వేద పాఠశాలకు 3 కిలో మీటర్ల దూరంలో అగ్నికీలలు అడవుల్లోని పచ్చదనాన్ని దహించి వేస్తున్నాయి. గతంలోనూ కార్చిచ్చు కారణంగా శేషాచలంలో కిలో మీటర్ల పరిధిలోని అటవీ ప్రాంతం కాలిపోయింది. సదరు కార్చిచ్చును నిలువరించేందుకు రోజుల తరబడి కష్టపడాల్సి వచ్చింది. గతానుభవాల నేపథ్యంలో తాజా కార్చిచ్చుపై సమాచారం అందుకున్న అధికారులు మంటలను ఆర్పేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.