విశాఖ జిల్లాలో వ్యాన్ బీభత్సం... చిన్నారులపైకి దూసుకెళ్లిన వ్యాన్, బాలిక మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖ జిల్లాలో వ్యాన్ బీభత్సం... చిన్నారులపైకి దూసుకెళ్లిన వ్యాన్, బాలిక మృతి

విశాఖపట్నం జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన నేడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని హుకుంపేట మండలం రంగశిల వద్ద కొద్దిసేపటి క్రితం అదుపు తప్పిన ఓ వ్యాన్ బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తూ అదుపు తప్పిన సదరు వ్యాన్ నలుగురు చిన్నారుల పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి బాలిక అక్కడికక్కడే మృత్యువాత పడింది. మరో ముగ్గురు చిన్నారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురు చిన్నారుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.

More Telugu News