రేపు విశాఖ బీచ్ లో కోటి లింగార్చన... హాజరవనున్న చిరంజీవి, మోహన్ బాబు, బ్రహ్మీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు విశాఖ బీచ్ లో కోటి లింగార్చన... హాజరవనున్న చిరంజీవి, మోహన్ బాబు, బ్రహ్మీ

మంగళవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖపట్నం బీచ్ లో కోటి లింగార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. రేపు సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, మోహన్ బాబు, బ్రహ్మానందం, మాజీ ఎంపీ జయప్రద, మాజీ ఎమ్మెల్యే జయసుధ హాజరవుతున్నారని ఆయన తెలిపారు. కళలన్నా, కళాకారులన్న ఆదరణ కనబరిచే సుబ్బరామిరెడ్డి ప్రతి ఏడాది సీనియర్ సినీ తారలను సత్కరిస్తుండడం తెలిసిందే.

More Telugu News