Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షూటింగ్ యూనిట్ తో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్ఐ... ఎస్పీకి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు

ఖమ్మం జిల్లా పాల్వంచలో షూటింగ్‌ జరుపుకుంటున్న 'ఆంధ్రాపోరి' చిత్ర యూనిట్‌ బృందంతో ఎస్ఐ షణ్ముగాచారి అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గత 20 రోజులుగా షూటింగ్ సాగుతుండగా, భద్రాచలం రోడ్ లోని బృందావన్ రెస్టారెంట్ లో చిత్ర యూనిట్ బస చేసింది. ఇటీవల రాత్రివేళ ఎస్ఐ ఆ రెస్టారెంట్ కు వెళ్లి చిత్ర బృందంతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, పూరి జగన్నాథ్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిని విధులనుంచి తప్పించి, ఎస్పీకి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.

More Telugu News