Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమండ్రిలో దొంగల హల్ చల్!

రాజమండ్రి పట్టణంలో దొంగలు హల్ చల్ చేశారు. ఇక్కడి సుబ్రహ్మణ్యనగర్ లోని రెండు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 12 తులాల బంగారం, 400 గ్రాముల వెండి ఆభరణాలను దొంగిలించారు. ఇక్కడ నివాసం ఉంటున్న స్వామి ఈ నెల 11న వైజాగ్ వెళ్లి ఆదివారం ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తలుపులు తీసి ఉండే సరికి దొంగతనం జరిగిందని తెలుసుకున్నాడు. కాగా, స్వామి పక్క ఇంటి తాళం పగిలి ఉండటంతో రెండు ఇళ్లలోనూ చోరీ జరిగిందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News