తిరుపతిలో రీపోలింగ్ జరిపించండి: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు రఘువీరా లేఖ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుపతిలో రీపోలింగ్ జరిపించండి: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు రఘువీరా లేఖ

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ కారణంగా తిరుపతిలో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మకు లేఖ రాశారు. ఎన్నికల్లో భాగంగా అధికార యంత్రాంగం అధికార పార్టీ టీడీపీ అభ్యర్థికి పూర్తి స్థాయిలో సహకరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఏకంగా రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని స్వతంత్ర అభ్యర్థులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయమూ విదితమే.

More Telugu News