తెలంగాణలో డ్రై పోర్టులు ఏర్పాటు చేయండి: నిర్మలా సీతారామన్ ను కోరిన కేసీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో డ్రై పోర్టులు ఏర్పాటు చేయండి: నిర్మలా సీతారామన్ ను కోరిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు భేటీ అయ్యారు. సీఎం అధికార నివాసానికి వెళ్లిన ఆమె... కేసీఆర్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో సీ పోర్టులు లేనందున, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆమెను కేసీఆర్ కోరారు. చేనేత పరిశ్రమకు ప్రోత్సాహం అందించాలని, మార్కెటింగ్ వసతి కల్పించాలని విన్నవించారు. నదుల ప్రక్షాళనలో భాగంగా మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయాలని కోరారు. సీఎం కోరికలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

More Telugu News