Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంగ్లండ్ పై భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా

వరల్డ్ కప్ లో తొలి రోజు రెండు భారీ విజయాలు నమోదయ్యాయి. శ్రీలంకపై 98 పరుగులతో న్యూజిలాండ్ శుభారంభం చేయగా, ఆస్ట్రేలియా జట్టు ప్రధాన ప్రత్యర్థి ఇంగ్లండ్ పై 111 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్... ఫించ్ (135), మ్యాక్స్ వెల్ (66), బెయిలీ (55) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ను మిషెల్ మార్ష్ దెబ్బతీశాడు. టాపార్డర్ దారుణంగా విఫలమవ్వగా బెల్ (36) కాస్త ఫర్వాలేదనిపించినప్పటికీ టేలర్ (98) ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డాడు. సహచరులంతా తక్కువ స్కోరుకే వెనుదిరుగుతున్నా వోక్స్ (37) అండతో కాసేపు ప్రతిఘటించి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 231 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇండ్లండ్ బౌలర్లలో ఫిన్ హ్యాట్రిక్ తో పాటు 5 వికెట్లు తీసి రాణించగా, ఆస్ట్రేలియా బౌలర్లలో మిషెల్ మార్ష్ 5 వికెట్లు తీసి రాణించాడు. అతనికి స్టార్క్, జాన్సన్ రెండేసి వికెట్లు తీసి సహకారమందించారు.

More Telugu News