సినిమాల్లో ఈ పదాలు ఉపయోగిస్తే చర్యలు: కేంద్ర సెన్సార్ బోర్డు
హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో బూతులు కూడా సంభాషణల్లో భాగంగానే ఉంటాయి. మాటల రచయితలు క్రియేటివిటీ పేరిట ద్వంద్వార్థాలు, తిట్లు, బండ బూతులు వాడుతూ సినిమాలకు అవే ప్రధాన ఆకర్షణగా ట్రైలర్స్ లో రిలీజ్ చేసి సొమ్ముచేసుకుంటున్నారు. ఇది ప్రాంతీయ భాషా సినిమాలకు వర్తించదు. ప్రాంతీయ సినిమాల్లో దర్శకులు ఇంకా కొన్ని సంప్రదాయాలను మర్చిపోలేదు. దీంతో కేంద్ర సెన్సార్ బోర్డు ఇకపై ఏఏ పదాలు సినిమాల్లో వినిపించకూడదో ఓ జాబితా విడుదల చేసింది. కేంద్ర సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ పేరిట జారీ అయిన ఉత్తర్వులను నిర్మాతల మండళ్లకు, సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలకు పంపారు.
ఇకపై ఈ పదాలను సినిమాల్లో ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని సెన్సార్ బోర్డు హెచ్చరించింది. డైలాగుల్లో... బాస్టర్డ్, సన్నాఫ్ ఎ బిచ్, మాస్ట్రబేటింగ్, ఫక్, ఫకర్ లేదా ఫకింగ్, మదర్ ఫకర్, ఫకింగ్ కంట్, కాక్ సక్కర్, ఫకింగ్ డిక్, స్క్రూ, డిక్, యాస్ హోల్, బిచ్, పుస్సీ వంటి పదాలను వాడకూడదని స్పష్టం చేసింది.