నా వ్యాఖ్యల్లో తప్పేముంది?: జేసీ
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిన్నటి తన వ్యాఖ్యలను సమర్ధించుకునే రీతిలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలకు ఏమాత్రం ప్రాధాన్యమివ్వడం లేదని నిన్న వ్యాఖ్యానించిన ఆయన కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఢిల్లీలో ఏపీ ఎంపీలకు ప్రాధాన్యం లభించడం లేదన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పానని ఆయన తెలిపారు. నదీజలాలపై తెలుగు రాష్ట్రాలు పోట్లాడుకుంటూ రాయలసీమకు అన్యాయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.