బీజేపీ ఎంపీ కుమార్తె కాబట్టే సోనాక్షీ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు: 'ఏఐబీ రోస్ట్'పై మహేశ్ భట్ స్పందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ ఎంపీ కుమార్తె కాబట్టే సోనాక్షీ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు: 'ఏఐబీ రోస్ట్'పై మహేశ్ భట్ స్పందన

దేశంలో చర్చనీయాంశం అయిన 'ఏఐబీ రోస్ట్' వివాదంపై బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ స్పందించారు. ఈ కార్యక్రమంలో అశ్లీలతకు తావిచ్చారంటూ 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తెలిసిందే. వారిలో కరణ్ జోహార్, రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్, దీపికా పదుకొనే, అలియా భట్ తదితరులున్నారు. అయితే, ఆ కార్యక్రమంలో పాల్గొన్న సోనాక్షీ సిన్హా పేరు ఎందుకు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదని మహేశ్ భట్ ప్రశ్నించారు. సోనాక్షీ బీజేపీ ఎంపీ (నటుడు శత్రుఘ్ను సిన్హా) కుమార్తె అయినందునే ఆమె పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదని విమర్శించారు. దీనివెనుక బలమైన శక్తులున్నాయని ఆరోపించారు.

More Telugu News