వరల్డ్ కప్ ఫార్మాట్ చప్పగా ఉందంటున్న సన్నీ, లక్ష్మణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరల్డ్ కప్ ఫార్మాట్ చప్పగా ఉందంటున్న సన్నీ, లక్ష్మణ్

తాజా వరల్డ్ కప్ లో అనుసరిస్తున్న ఫార్మాట్ చప్పగా ఉందని మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ అంటున్నారు. మొత్తం 14 జట్లు పోటీపడే ఈ టోర్నీలో గ్రూప్ దశలో అమీతుమీకి పెద్దగా అవకాశం లేదన్నారు. అగ్రశ్రేణి జట్లే క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంటాయన్న విషయం ముందే అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. అయితే, లీగ్ దశలో ఆడడం పసికూనలకు కూడా లాభిస్తుందని, పెద్ద జట్లను ఓడించగలిగితే వారికి కూడా నాకౌట్ దశకు చేరే అవకాశాలుంటాయని గవాస్కర్ విశ్లేషించాడు. స్పిన్నర్లపై ఆధారపడే ఉపఖండం జట్లు కాస్త కష్టపడాల్సి ఉంటుందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.

More Telugu News