Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవినీతి రహిత పాలన అందించడమే కేసీఆర్ లక్ష్యం: ఎంపీ వినోద్

గతంలో పాలించిన ప్రభుత్వాలన్నీ అవినీతిమయమైనవని... అవినీతిని రూపుమాపి, సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఆ పార్టీ ఎంపీ వినోద్ అన్నారు. అవినీతి రహిత పాలనను అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తామని చెప్పారు. కరీంనగర్ లోని 41వ డివిజన్ లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైవిధంగా స్పందించారు.

More Telugu News