గతేడాది భారత్ లో తగ్గిన బంగారం డిమాండ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గతేడాది భారత్ లో తగ్గిన బంగారం డిమాండ్

భారత్ లో బంగారం డిమాండ్ 2013లో 974.8 టన్నుల నుంచి 2014లో 842.7 టన్నుల (14 శాతం)కు క్షీణిస్తూ వచ్చిందని ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజీసీ) ప్రకటించింది. ఇందుకు కారణం ప్రభుత్వం బంగారం దిగుమతులపై నిబంధనలను విధించడం వల్లేనని తెలిపింది. "భారత్ పూర్తి బంగారం డిమాండ్ 2014లో కొద్దిగా తగ్గింది. అయితే అకస్మాత్తుగా దాని దిగుమతిపై విధించిన నిబంధనలతో సంవత్సరం నుంచి ఇలా జరుగుతోంది. పెట్టుబడి రంగంపై ఇది చాలా ప్రభావం చూపుతుంది" అని భారత్ లో డబ్ల్యుజీసీ మేనేజింగ్ డైరెక్టర్, పీఆర్ సోమసుందరం పేర్కొన్నారు. ఇదిలాఉంటే 2013లో దిగుమతి చేసుకున్న 612.7 టన్నుల బంగారంతో పోల్చుకుంటే, గతేడాది 8 శాతం పెరిగి 662.1 టన్నులు ఉందట. పండుగల సందర్భంగా, పెళ్లి కూతుర్ల డిమాండ్ మేరకు, ఆర్థిక సెంటిమెంట్ తో జ్యువెలరీ కొనుగోలులో 8 శాతం వృద్ధికి చేరిందని సుందరం వివరించారు. మరోవైపు పెట్టుబడుల్లో కూడా బంగారం శాతం తగ్గిందని అంటున్నారు.

More Telugu News