ఢిల్లీ ఫలితాలపై ఆర్ఎస్ఎస్-బీజేపీ ఎన్నికల కమిటీ సమీక్ష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ ఫలితాలపై ఆర్ఎస్ఎస్-బీజేపీ ఎన్నికల కమిటీ సమీక్ష

బీజేపీని కంగుతినిపించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆర్ఎస్ఎస్-బీజేపీ ఎన్నికల కమిటీ సమీక్ష చేయాలనుకుంటోంది. ఈ నెల 15న ఈ కమిటీ భేటీ అయి ఓటమిపై విశ్లేషించనుంది. ఈ ఎన్నికల్లో ఆకర్షణీయమైన, ఐఐటీ ఖరగ్ పూర్ గ్రాడ్యుయేట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ను ఎదుర్కొవడంలో పూర్తిగా విఫలం కావడం, 70 శాసనసభ అభ్యర్థుల్లో పార్టీ సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో పార్టీ గొంతు ఒక్కసారిగా మూగబోయింది. బీజేపీ నుంచి కేవలం జగదీష్ ప్రధాన్, ఓం ప్రకాష్ శర్మ, విజేందర్ గుప్తాలు మాత్రమే ఆప్ సునామీ ధాటికి తట్టుకుని గెలవగలిగారు. ఈ నేపథ్యంలో ఇంతటి దారుణ పరాజయానికి కారణాలను ఎన్నికల కమిటీ అవలోకనం చేసుకోవాలనుకుంటోంది.

More Telugu News