గరుడ బస్సులో భారీ చోరీ... టిఫిన్ కోసం బస్సాపితే 4 లక్షలు కొట్టేసిన చోరులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గరుడ బస్సులో భారీ చోరీ... టిఫిన్ కోసం బస్సాపితే 4 లక్షలు కొట్టేసిన చోరులు

ఏపీ ఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సు గరుడలో కొద్దిసేపటి క్రితం భారీ చోరీ జరిగింది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వెలుగుచూసిన ఈ ఘటనలో ఓ ప్రయాణికుడికి చెందిన రూ.4 లక్షలను గుర్తు తెలియని దుండగులు తస్కరించారు. చెన్నై వెళుతున్న బస్సు నాయుడుపేట వద్ద అల్పాహారం కోసం ఆగింది. ఈ క్రమంలో టిఫిన్ చేసేందుకు ప్రయాణికులంతా కిందకు దిగగా, చోరులు డబ్బును కాజేశారు. టిఫిన్ ముగించుకున్న బాధితుడు బస్సెక్కి చూడగా, చోరీ విషయం బయటపడింది. దీంతో బాధితుడు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.

More Telugu News