ఆరుగురు మంత్రులతో కొలువుదీరనున్న కేజ్రీవాల్ కేబినెట్!
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రామ్‌లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. తొలిదశలో కేజ్రీవాల్ కేబినెట్ లో ఆరుగురు మంత్రులకు చోటు దక్కవచ్చని తెలుస్తోంది. ఆప్ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, జితేంద్ర తోమర్, కపిల్‌శర్మ, సందీప్ కుమార్, సతేందర్ జైన్, అసిం అహ్మద్ ఖాన్ లను కేజ్రీవాల్ తన మంత్రులుగా ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. వీరిలో మనీష్ శిసోడియాకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.