మూడు ఐపీఎల్ మ్యాచ్ లకు వేదిక వైజాగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడు ఐపీఎల్ మ్యాచ్ లకు వేదిక వైజాగ్

ఐపీఎల్ 2015 షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. తాజా సీజన్ ఏప్రిల్ 8న ప్రారంభం కానుండగా, ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంప్ కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం మూడు మ్యాచ్ లకు వేదికగా నిలవనుంది. సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ఆడనున్న మూడు మ్యాచ్ లను విశాఖలో జరగనున్నాయి. మే 24న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ తో ఈవెంట్ ముగుస్తుంది. గత సీజన్ లో షారూఖ్ ఖాన్ కు చెందిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

More Telugu News